»Cm Revanth Reddy Cm To Launch A Special Website For Public Governance
CM Revanth Reddy: ప్రజాపాలనకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్న సీఎం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలనకు ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీనిని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే ప్రజాపాలన దరఖాస్తులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు.
CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలనకు ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించారు. prajapalana.telangaana.gov.in వైబ్‌సైట్‌ను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే ఈరోజు ప్రజాపాలన దరఖాస్తులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ శాంతి కుమారితో పాటు వివిధ శాఖల మంత్రులతో పాటు ఉన్నతాధికారలు దీనికి హాజరవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఎనిమిది రోజుల పాటు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు.
ప్రతి నాలుగు నెలలకొకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ప్రజాపాలనలో మొత్తం 1,25,81,383 దరఖాస్తులు అందగా.. 3714 అధికార బృందాలు దరఖాస్తు స్వీకరణకు పాల్గొన్నాయి. ఇప్పటివరకు స్వీకరించిన దరఖాస్తులను ఆ వెబ్సైట్లో పొందుపరిచే ప్రక్రియను మొదలు పెట్టారు. డేటా మొత్తాన్ని ఎంట్రీ చేసిన తర్వాత అందులో అర్హులైన వారి జాబితాను అధికారులు ప్రకటించి వారికి వర్తించే పథకాలను అమలు చేయనున్నారు.