KMM: మధిర పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ రోడ్డుపైనే దుకాణాలు ఏర్పాటు చేయడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు తెలిపారు. దీనికి తోడు ఎడ్ల బండ్లు సైతం పట్టణంలో సంచరిస్తుండటంతో అర్ధ గంట నుంచి గంటమేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని అన్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు.