అన్నమయ్య: మదనపల్లె ఎస్బీఐ కాలనీలోని గ్లోబల్ ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ ముఠా నడిపిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయినప్పటికీ ఆసుపత్రిని సీజ్ చేయకపోవడంతో విమర్శలు వచ్చాయి. తాజాగా గురువారం ఉదయం కోర్టు ఉత్తర్వుల మేరకు గ్లోబల్ ఆస్పత్రిని సీజ్ చేశామని డీఎస్పీ వెల్లడించారు.