MBNR: దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి గురువారం భారీగా చేరికలు జరిగాయి. భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో మద్దిగట్ల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.