AP: ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీస్ దగ్గర విజయనగరం భవానీపురం బాధితులు ఆందోళనకు దిగారు. ఆయనను కలిసేందుకు వెళ్లగా పోలీసులు బాధితులను అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న తమను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గూడు కూల్చడంతో రోడ్డున పడ్డామని ఆవేదన చెందారు.