JGL: మేడిపల్లి గురుకుల పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలకు ఎంపికయ్యాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీల్లో పాఠశాల విద్యార్థి వర్షిత్ స్థిరమైన వ్యవసాయంపై రూపొందించిన ప్రదర్శన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారుల చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు.