వరంగల్ ఆర్టీసీ టు డిపో ఎయిర్ బస్ డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడిగా బొమ్మకంటి సంజీవ్, ప్రధాన కార్యదర్శులుగా శ్రీను, తిరుపతి ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు సంజీవ్ మాట్లాడుతూ.. ప్రైవేట్ డ్రైవర్ల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, తోటి డ్రైవర్లు సంజీవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.