NTR: విజయవాడలోని లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ పై జరిగిన కూల్చివేతల చర్యలపై తీవ్రమైన అనుమానాలు కలుగుతున్నాయని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్న సమయంలో అధికారులు బాధితుల ఇళ్లను కూల్చివేశారని ఆయన ఈరోజు విమర్శించారు. ఈ ఘటనపై CBI విచారణ జరిపి, నిందితులకు శిక్షించాలని, బాధితులకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామన్నారు.