NLR: పొదలకూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ షాకీర్ నిజాయితీని చాటుకున్నారు. నెల్లూరు బార్కస్ సెంటర్లోని ఏటీఎం సెంటర్ వద్ద ఎవరో నగదు పోగొట్టుకున్నారు. ఆ నగదును నిజాయితీతో చిన్నబజార్ పోలీసు స్టేషన్లో అప్పగించారు. దీంతో స్టేషన్ సిబ్బంది కానిస్టేబుల్ షాకీర్ను అభినందించారు.