KRNL: ఆదోని పట్టణంలోని ఎస్.కె.డి. కాలనీలో అయ్యప్ప మండల పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమానికి టీడీపీ యువ నాయకుడు మారుతి నాయుడు రూ. 75,000 విరాళంగా అందించారు. మారుతి నాయుడు మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి సేవ తమ కుటుంబానికి పరంపరాగతమైన సేవ అని, గత కొన్నేళ్లుగా నిరంతరంగా ఈ సేవను కొనసాగిస్తున్నామని తెలిపారు.