నిజాంపేట మండలం నస్కల్-రాంపూర్ వెళ్లే రోడ్డు మార్గంలో మూల మలుపులు అధికంగా ఉన్నాయి. ఈ మూలమలుపుల వద్ద చెట్లు పెరగడంతో ముందు వచ్చే వాహనాలు కనిపించడం లేదు. అంతేకాకుండా ఈ మలుపు వద్ద ఓ ప్రమాదకరమైన బావి కూడా ఉంది. ఈ రోడ్డు గుండా వెళ్లే ప్రయాణికులు జాగ్రత్తగా వెళ్లాలని ఇరు గ్రామల ప్రజలు సూచిస్తున్నారు. అధికారులు వెంటనే సూచిక బోర్డులు ఏర్పటు చేయాలని కోరుతున్నారు.