HYD: రవీంద్ర భారతిలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వర్ధంతి సభను ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని రోశయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలిసి అందజేశారు.