KMR: మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లరా సర్పంచ్ స్థానానికి పోటీ చేసేందుకు గురువారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సాక్షి మహేష్ సోమవార్ తమ నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సోసైటీ ఛైర్మన్ శ్రీనివాస్ పటేల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.