NLR: రెండు రోజుల క్రితం UPలోని గోరఖ్ పూర్ చెందిన సౌరబ్ అనే యువకుడు ఉదయగిరి (M) గండిపాలెం జలాశయంలో గల్లంతైన విషయం తెలిసిందే. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గల్లంతైన మృతదేహం వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేశారు. గురువారం మరోసారి ప్రయత్నం చేసి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.