NLG: చలికాలంలో పొగమంచు కారణంగా డ్రైవర్లు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. పొగమంచు వలన రహదారి స్పష్టంగా కనిపించక ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ముందుగా బయలుదేరడం, అతివేగం నివారించడం, లోబీమ్/ఫాగ్ లైట్లు వాడటం, సురక్షిత దూరం పాటించడం, అద్దాలు శుభ్రంగా ఉంచడం వంటి నియమాలను పాటించాలని సూచించారు.