AKP: కార్మికుల సమస్యలపై సీఐటీయూ అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి మనబాల రాజేష్ తెలిపారు. ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు వరకు విశాఖలో జరిగే అఖిలభారత సీఐటీయు మహాసభల గోడపత్రికను ఇవాళ నక్కపల్లిలో ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.