AP: మాజీ సీఎం జగన్ మాట్లాడేవన్నీ అబద్ధాలేనని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతులను మోసం చేసిందెవరో ప్రజలకు తెలుసు అని తెలిపారు. పెట్టుబడి రాయితీ ఇవ్వని జగన్కు.. రైతులపై మాట్లాడే అర్హతే లేదని విమర్శించారు. గత ప్రభుత్వం ధాన్యం బకాయిలు రూ.1,674 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. వాస్తవాలపై జగన్తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.