ELR: జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీగా జీ.ముని రాజా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఏఆర్ పోలీస్ సిబ్బంది యొక్క సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తానని హామీ ఇచ్చారు. సిబ్బంది సమస్యలను ఎప్పటికప్పుడు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు.