VZM: రాజాం పోలీస్ స్టేషను విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు పరిశీలించారు. క్రైమ్ రిపోర్ట్, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాలను సీఐ అశోక్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. పోలీసింగ్ మరింత బాగా చేయాలని సిబ్బందికి సూచించారు. సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.