TG: HYDలోని ఉప్పల్ ఫ్లై ఓవర్‌ను 8 ఏళ్లుగా కడుతూనే ఉన్నారని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితి మారటం లేదని విమర్శించారు. ఈ విషయాన్ని తాను శాసనమండలిలో కూడా ప్రశ్నించినట్లు తెలిపారు. కానీ ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ప్రజల పట్ల ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందని ఎద్దేవా చేశారు.