VSP: మార్గశిర రెండో గురువారం కావడంతో బురుజుపేటలో ఉన్న కనకమాలక్ష్మీ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉచిత దర్శనంతో పాటు రూ.100, రూ. 200, రూ. 500 క్యూ లైన్లు కూడా టౌన్ కొత్త రోడ్డుకు చేరాయి. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.