SKLM: జి. సిగడాం M పాలఖండ్యాం జంక్షన్ వద్ద నెలకొన్న డ్రైనేజ్ సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఈశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రూ. 6,00,000 నిధులను మంజూరు చేయించడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఈ డ్రైనేజీ పనులను మండల అధ్యక్షులు కుమరాపు రవికుమార్ పరిశీలించారు. పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అన్నారు.