కృష్ణా: రెండు దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వ నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం తెలిపారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శ్రీకాకుళంలోని శ్రీ ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.రెండున్నర కోట్లు, నాగాయలంకలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి రూ.కోటి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.