NLR: విడవలూరు మండలంలోని స్మార్ట్ పోలీస్ స్టేషన్లో సీలింగ్ నేలకూలింది. గత ఆరు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నానడంతో సీలింగ్ కూలింది. కూలిన సమయంలో పోలీస్టేషన్లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్మార్ట్ పోలీస్ స్టేషన్ నిర్మించేటప్పుడు రేకులతో కాకుండా స్లాబుతో నిర్మించి ఉంటే బాగుండేదని అధికారులు వాపోతున్నారు.