‘అఖండ 2’ మూవీ ప్రమోషన్స్‌లో నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుస సినిమాలతో విజయం సాధించానని, ఈ సినిమా కూడా ఆ లిస్టులో చేరే మరో మూవీ అని అన్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ చదివి ఒకేరోజులోనే ఓకే చెప్పినట్లు తెలిపారు. అంతేకాదు తాను ఒక పాత్రలోకి పూర్తిగా ప్రవేశిస్తే పూనకాలే అని, ఆ పాత్రలో లీనమైపోతానని చెప్పారు. ఇక ఈ సినిమా రేపు విడుదల కానుంది.