TG: హైదరాబాద్లోని రవీంద్రభారతిలో దివంగత సీఎం రోశయ్య 4వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ వర్ధంతి సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.