నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం భేటీ బచావో బేటి పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఆడపిల్లల చదువు ఆవశ్యకతను వివరించారు. చిన్న వయసులో ఆడపిల్లలకు పెళ్లి చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటారని, ఆడపిల్లల రక్షణ చట్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా మత పెద్దలు పాల్గొన్నారు.