BPT: అమృతలూరు మండలం ఇంటూరు గ్రామంలో గురువారం డ్వాక్రా లబ్ధిదారులకు పాడి పశువులు అందచేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొని, లబ్ధిదారులకు పాడి పశువులను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించడమే తమ లక్ష్యం అని అన్నారు. దీని ద్వారా మహిళలు మరింత ఆర్థికంగా ఎదుగుతారన్నారు.