SRCL: తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ సర్పంచ్ స్థానానికి మూడు నామినేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. సర్పంచ్ అభ్యర్థిగా బూర ఉష, మోర నిర్మల, ముడారి రాజయ్య నామినేషన్లు దాఖలు చేశారని వారు పేర్కొన్నారు. అభ్యర్థుల నామినేషన్లను ధ్రువీకరిస్తూ ఫారం 6ను అధికారులు విడుదల చేశారు. ఇప్పటికే అభ్యర్థులు పలువురని కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.