KRNL: ఆదోనికి ప్రత్యేక జిల్లా హోదా కల్పించాలంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, పలువురు పార్టీ నాయకులు గురువారం మంత్రాలయ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నాయకులు ఉదయ్, ఖాజా, కృష్ణ, ఆఫ్రిది, రఘు, శేఖర్ ఆదోని జిల్లా అయితేనే పశ్చిమ ప్రాంత అభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.