ATP: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 25వ సారి శబరిమల అయ్యప్ప సన్నిధానానికి ఇరుముడితో పయనమయ్యారు. 41 రోజుల నియమనిష్టల దీక్ష తర్వాత, ఆయన హైదరాబాద్లోని శ్రీ ధర్మశాస్త భక్త సమాజంలో అరుణ్ గురుస్వామి చేతుల మీదుగా ఇరుముడి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన పడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు.