KMR: కలెక్టరేట్లో మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ రోశయ్య వర్ధంతిని గురువారం నిర్వహించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్లు రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని అధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.