WNP: ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. వనపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జరుగుతుందా లేదా పరిశీలన చేయడం మైక్రో అబ్జర్వర్ల ప్రధాన బాధ్యత అన్నారు.