సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ సభ్యులు, పట్టణంలోని పోలీస్ కార్యలయంలో సీఐ కృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించి పూల గుచ్ఛాని అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, ఉపాధ్యక్షులు డా. గాజుల బాలయ్య, మోర రవి, క్యాషియర్ యెల్లే శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కోడం శ్రీనివాస్, వార్డు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.