NLG: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చందంపేట మండలంలో ఎక్సైజ్ శాఖ అధికారులు పలు గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. పోలేపల్లి, ముదండ్ల, చందంపేట, మునవత్ తండా తదితర ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో 9 లీటర్ల నాటుసారా, 400 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.