భారత్ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్.. ప్రధాని మోదీతో డిన్నర్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్‌కు ఇష్టమైన వంటకాలపై నెట్టింట చర్చ మొదలైంది. ఆయన సంప్రదాయ వంటకాలను ఇష్టపడతారట. బ్రేక్‌ఫాస్ట్‌లో కాటన్ చీజ్, తేనెతో చేసిన టావోరాగ్, గుడ్లు, తాజా పండ్లతో చేసిన జ్యూస్ తీసుకుంటారట. స్టర్జియన్ చేపలు, గొర్రె మాంసం చాలా ఇష్టమట. చక్కెర పదార్థాలను ఎక్కువ తినరట.