విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, హోంమంత్రి అనిత అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పురోగతిపై అధికారులు చర్చించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, తదితరులు శాఖల పనుల పురోగతిని సమీక్షించారు.