AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(SIPB) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26 కంపెనీలకు చెందిన దాదాపు రూ.20,000 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనపై చర్చ జరిగింది. ఈ భారీ పెట్టుబడులు, పారిశ్రామిక యూనిట్ల ప్రతిపాదనలకు SIPB ఆమోదం తెలపనుంది. దీని ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా.