KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ మఠం ప్రవచన మండపంలో భక్తుల పేరు, గోత్ర నామాలతో సామూహిక సంకల్పాలు నిర్వహించారు. సత్యనారాయణ చిత్రపటాన్ని ప్రత్యేక పీఠంపై కొలువుదీర్చి పంచామృత అభిషేకాలు చేశారు. స్వామివారి కథను భక్తులకు వివరించారు. నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు ఇచ్చారు.