విశాఖ కేంద్రంగా ఏర్పడే దక్షిణ కోస్తా రైల్వే జోన్లో పని చేసేందుకు ఆసక్తి ఉన్న నాన్ గెజిటెడ్ ఉద్యోగుల కోసం రైల్వేశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ ఎంపికను HRMS ద్వారా చేపట్టనున్నట్లు రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియకు సంబంధించి డ్రాఫ్ట్ నోటీసులు సిద్ధం చేయాలని దక్షిణ కోస్తా, తూర్పు కోస్తా రైల్వే GMలకు సమాచారం అందించారు.