E.G: ఏపీలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం రాజమండ్రిలోని ప్రసాదిత్య మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సారధి సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాజమండ్రి నగరం పర్యాటకం, సంస్కృతి & వినోద రంగాల్లో మరింత అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు.