»Another Shock Telangana Bjp Vikarabad District Ex Minister A Chandrasekhar Resigned To Bjp
BJP: రాష్ట్రంలో బీజేపీకి మరో దెబ్బ..కీలక నేత రాజీనామా
రాష్ట్రంలో బీజేపీ(BJP) పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి బండి సంజయ్ ని తొలగించిన తర్వాత రాజకీయ వర్గాలతోపాటు ప్రజల్లో కూడా బీజేపీపై అభిప్రాయాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఓ కీలక నుంచి బీజేపీకి రాజీనామా చేశారు.
Another shock telangana BJP Vikarabad district ex minister A Chandrasekhar resigned to bjp
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా(vikarabad district) మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్(Chandrasekhar)బీజేపీకి రాజీనామా చేశారు. తన బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను కేంద్ర ప్రభుత్వం ఆపలేకపోతోందని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో 12 ఏళ్లు పనిచేసి మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు వదులుకున్నానని చెప్పారు. తెలంగాణ వచ్చినా కూడా అనేక మంది యువతకు ఉద్యోగాలు రాలేదని, రైతుల పొలాలకు నీళ్లు రాలేదన్నారు. తనలాంటి ఉద్యమ నేతలు ఎందరో బీజేపీలో చేరారని, ఇప్పుడు కష్టాల్లో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. దీంతో బీజేపీతో మూడేళ్ల బంధానికి తెరపడింది. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ట్రాక్ రికార్డ్ చూసి ఢిల్లీ కాంగ్రెస్ నేతలు కూడా సానుకూలంగా ఉన్నారని..ఆగస్టు 18న ఢిల్లీలో కాంగ్రెస్ నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం.
మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. 1985లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం 1989, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2001లో టీఆర్ఎస్లో (BRS) చేరారు. 2004 ఎన్నికల్లో గెలిచిన తర్వాత పొత్తులో భాగంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. తెలంగాణ ఉద్యమం కోసం 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడిపోయిన ఆయన.. ఆ తర్వాత టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. కానీ.. 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేక.. 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2021లో బీజేపీ(BJP)లో చేరి.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్(congress) వైపు చూస్తున్నారు.