Vikarabad మూడో తరగతి విద్యార్థి మృతి.. టీచరే కొట్టాడని ఆందోళన
ఇంటర్ విద్యార్థి (Inter Student) ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ సంఘటన మరువకముందే మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్ బాదడంతో మూడో తరగతి విద్యార్థి మృతి చెందాడని ఆరోపణలు రావడంతో కలకలం రేపింది. బాలుడి మృతితో కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.
పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు (Teachers) విద్యార్థులపై కర్కశంగా వ్యవహరిస్తున్నారు. చిన్న వయసు కావడంతో వాటిని తట్టుకోలేక మృతి చెందుతున్నారు. దీంతో విద్యాలయాలు కాస్త మరణాలకు కేంద్రంగా మారుతున్నాయి. రెండు రోజుల కిందట అధ్యాపకుల (Lecturers) వేధింపులు తాళలేక ఓ ఇంటర్ విద్యార్థి (Inter Student) ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ సంఘటన మరువకముందే మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్ బాదడంతో మూడో తరగతి విద్యార్థి మృతి చెందాడని ఆరోపణలు రావడంతో కలకలం రేపింది. బాలుడి మృతితో కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన తెలంగాణ (Telangana)లోని వికారాబాద్ జిల్లా (Vikarabad District)లో చోటుచేసుకుంది.
వికారాబాద్ జిల్లా పూడూరు (Pudur) మండలం చిలాపూర్ సమీపంలో కేశవరెడ్డి రెసిడెన్షియల్ (Keshavareddy Residency School) పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో మొయినాబాద్ (Moinabad) మండలం పెద్దమంగళారం గ్రామానికి చెందిన కార్తీక్ (Karthik) మూడో తరగతి చదువుతున్నాడు. అయితే 15 రోజుల కింద భుజానికి తీవ్ర గాయం కావడంతో కార్తీక్ అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయాన్ని నాలుగు రోజు కిందట యాజమాన్య కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే కుమారుడు కార్తీక్ తీసుకుని వెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కార్తీక్ మృతి చెందాడు. ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి లోనైన కుటుంబసభ్యులు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. యాజమాన్యం నిర్లక్ష్యంతో తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చన్గోముల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
యాజమాన్యం వివరణ కోరగా.. ‘కార్తీక్ బెడ్ (Bed)పై నుంచి కింద పడడంతో గాయాలయ్యాయి. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి కార్తీక్ ను పంపించాం’ అని పాఠశాల యాజమాన్యం తెలిపింది. యాజమాన్యం అబద్ధాలు చెబుతోందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయుడు కొట్టడంతో తమ బిడ్డ అనారోగ్యంతో మృతి చెందాడని తెలిపారు. వెంటనే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. వీరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు పలికారు.