Heart Attack పెళ్లి కొడుకు ప్రాణం తీసిన డీజే.. మండపంపైనే
పెళ్లిలో సంతోషంగా ఉండగా.. ఇలా సందర్భం లేదు.. ఏదీ లేదు అకస్మాత్తుగా గుండెపోటు రూపంలో మృత్యువు వచ్చేస్తోంది. అందరి ఇళ్లల్లో తీవ్ర విషాదం నింపుతోంది. ఓ యువకుడు డీజే (DJ Sounds) శబ్ధాలకు తట్టుకోలేక మృత్యుబాట పట్టాడు. అపరిమిత డీజే సౌండ్ ను తట్టుకోలేక పెళ్లయిన రోజే అతడు కన్నుమూశాడు. దీంతో ఆ పెళ్లింట తీవ్ర విషాదం నిండింది.
గుండెపోటు (Heart Attack)కు సమయం (Time), సందర్భం (Situation) ఏమీ లేదు. తనకు ఇబ్బంది అనిపించిన వెంటనే ఠక్కున ఆగిపోతుంది. క్షణాల్లో ప్రాణం గాల్లో కలిసిపోతుంది. జిమ్ చేస్తుండగా.. నడుస్తుండగా.. ఆట ఆడుతుండగా.. పెళ్లిలో సంతోషంగా ఉండగా.. ఇలా సందర్భం లేదు.. ఏదీ లేదు అకస్మాత్తుగా గుండెపోటు రూపంలో మృత్యువు వచ్చేస్తోంది. అందరి ఇళ్లల్లో తీవ్ర విషాదం నింపుతోంది. హైదరాబాద్ లో బీటెక్ విద్యార్థి సంఘటన జరిగిన రోజే ఓ యువకుడు డీజే (DJ Sounds) శబ్ధాలకు తట్టుకోలేక మృత్యుబాట పట్టాడు. అపరిమిత డీజే సౌండ్ ను తట్టుకోలేక పెళ్లయిన రోజే అతడు కన్నుమూశాడు. దీంతో ఆ పెళ్లింట తీవ్ర విషాదం నిండింది. ఈ సంఘటన బిహార్ (Bihar)లో చోటుచేసుకుంది.
బిహార్ లోని సితమర్హి (Sitamarhi District) జిల్లాలో సురేంద్ర కుమార్ (Surendra Kumar) వివాహం (Marriage) ఈనెల 1వ తేదీన ఘనంగా జరిగింది. ఇక తదనంతరం వివాహ విందు (Reception) కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. మండపంపైన వధూవరులు కూర్చుని ఉన్నారు. బంధుమిత్రుల రాకతో కోలాహలంగా ఉంది. ఈ సందర్భంగా డీజే పెట్టారు. ఫుల్ జోష్ తో కూడిన పాటలు పెట్టి బంధుమిత్రులు డ్యాన్స్ (Dance) చేస్తున్నారు. పెద్ద ఎత్తున శబ్ధం పెట్టడంతో పెళ్లి కుమారుడు సురేంద్ర తట్టుకోలేకపోయాడు. సౌండ్ వలన తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాడు. దీంతో పదే పదే శబ్ధం తగ్గించాలని అందరినీ కోరాడు. అయితే అతడి మాటను పెడచెవిన పెట్టి డీజే సౌండ్స్ కు డ్యాన్స్ లు చేస్తున్నారు. అయితే ఈ శబ్ధాలను తట్టుకోలేక సురేంద్ర కుప్పకూలిపోయాడు. అతడి గుండె ఈ శబ్ధాలను భరించలేకపోయింది. పరిమితికి మించిన శబ్ధాలను వాడడంతో అతడి గుండె బెదిరింది. దీంతో గుండెపోటుకు గురయ్యాడు.
ఈ అకస్మాత్తు సంఘటనతో అక్కడ కలకలం రేగింది. వెంటనే కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే సురేంద్ర మృతి చెందినట్లు తెలిపారు. పెళ్లయిన తెల్లారే అతడు మరణించడంతో వధువు కన్నీటి పర్యంతమైంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో స్థానికులు డీజేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజేలను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. సామాజిక కార్యకర్త డాక్టర్ రాజీవ్ కుమార్ మిశ్రా డీజేలను (Ban) నిషేధించాలని కోరాడు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశాడు. ప్రభుత్వ అధికారులు స్పందించి డీజే నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విన్నవించాడు.