కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్ పార్టీ (Congress Party) కంకణం కట్టుకుంది. ఏపీలో చెల్లని చెల్లెలు తెలంగాణలో రాజకీయ భవిష్యత్ కోసం అడుగు వేస్తూ అపసోపాలు పడుతున్న షర్మిల.. ఇక ప్రభుత్వ సర్వీస్ వదులుకుని రాజకీయాల్లోకి దిగిన కేంద్ర అధికారి ఒకరు.. ఇలా అందరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకుతున్నారు. వీరంతా యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు.. కొందరు వెళ్లారు కూడా. ఇలా తెలంగాణలో యాత్ర (Politcial Yatras)ల జాతర కొనసాగుతున్నది.
రాజకీయాలకు కేంద్రంగా తెలంగాణ (Telangana) నిలుస్తోంది. జాతీయ స్థాయిలో కేసీఆర్ (KCR) ప్రబలంగా వినిపిస్తుండడంతో కట్టడి చేసేందుకు నేరుగా ఢిల్లీ నుంచి నాయకులు రంగంలోకి దిగుతున్నారు. ఈసారి గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలని కమల దళం భావిస్తున్నది. ఇక కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్ పార్టీ (Congress Party) కంకణం కట్టుకుంది. ఏపీలో చెల్లని చెల్లెలు తెలంగాణలో రాజకీయ భవిష్యత్ కోసం అడుగు వేస్తూ అపసోపాలు పడుతున్న షర్మిల.. ఇక ప్రభుత్వ సర్వీస్ వదులుకుని రాజకీయాల్లోకి దిగిన కేంద్ర అధికారి ఒకరు.. ఇలా అందరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకుతున్నారు. వీరంతా యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు.. కొందరు వెళ్లారు కూడా. ఇలా తెలంగాణలో యాత్ర (Politcial Yatras)ల జాతర కొనసాగుతున్నది. ఇప్పుడు అమిత్ షాతోపాటు మరికొందరు కూడా తెలంగాణలో యాత్రలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో యాత్రల తెలంగాణగా మారింది.
ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ యాత్రలతో ఫుల్ జోష్ లో ఉంది. ఇప్పటికే పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టిన యాత్ర తెలంగాణలో సుదీర్ఘంగా సాగింది. అనంతరం దానికి కొనసాగింపుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ‘హత్ సే హాత్ జోడో’ యాత్ర చేపట్టాడు. జిల్లాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నాడు. ఇక కాంగ్రెస్ లోని మరికొందరు వ్యక్తిగత యాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే మధిరలో భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఒక విడత పాదయాత్ర చేపట్టాడు. మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించాలనే పట్టుదలతో ఈ యాత్ర చేశాడు. తదుపరి విడత కూడా చేయనున్నాడు. ‘తెలంగాణ కాంగ్రెస్ పోరు యాత్ర’ పేరిట మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర చేపట్టాడు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) యాత్ర చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) బైక్ యాత్ర చేపట్టాలని భావిస్తున్నాడు. పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ వినూత్న యాత్రకు తెరలేపాడు. విశ్వవిద్యాలయాల్లో పర్యటించి విద్యార్థుల మద్దతు కోరేందుకు ‘వర్సిటీల యాత్ర’ చేపట్టాలనే నిర్ణయానికి వచ్చాడు. పార్టీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttamkumar Reddy) తన హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు భార్య పద్మావతి నియోజకవర్గం కోదాడలో తరచూ పర్యటిస్తున్నాడు. యాత్రలాగా రెండు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు.
బీజేపీ తీవ్ర పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పలు విడతల్లో యాత్ర చేపట్టాడు. ప్రస్తుతం పార్టీలో కీలక నాయకుడు, కేంద్ర హోంమంత్రి రంగంలోకి దిగనున్నాడు. కర్ణాటక ఎన్నికలు ముగియగానే తెలంగాణలోనే తిష్ట వేయనున్నాడట. రథయాత్రలకు సిద్ధమయ్యాడని సమారాం. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ యాత్రలు ఉండేందుకు బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. త్వరలోనే ఈ యాత్రలు ప్రారంభం కానున్నాయని సమాచారం.
ఇలా ప్రధాన పార్టీలకు తోడు ఇతర పార్టీలు కూడా యాత్రలకు సిద్ధమయ్యాయి. ప్రజా ప్రస్థానం పేరిట వైఎస్ షర్మిల (YS Sharmila) పాదయాత్ర కొనసాగిస్తున్నది. యాత్రకు అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. అయినా ఆమె యాత్ర ద్వారా ప్రజల మధ్యలో ఉండేందుకు చూసుకుంటున్నారు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రస్తుతం తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నాడు. ఆయన కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాడు.
కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సీపీఎం యాత్రలకు సిద్ధమైంది. ఈనెల 17 నుంచి జన చైతన్య యాత్ర ప్రారంభించనుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీతో స్నేహాపూర్వక అనుబంధం కొనసాగిస్తున్న కమ్యూనిస్టులు బీజేపీని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ క్రమంలోనే మునుగోడులో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తో జత కట్టి ఉమ్మడి పోరాటం చేయాలని భావిస్తున్నాయి. ఇక పాతబస్తీకే ఏఐఎంఐఎం పార్టీ పరిమితమై ఉంది. అధికార పార్టీకి బహిరంగ మద్దతు పలుకుతోంది.