»Rajbhavan Is Nearer Than Delhi Says Telangana Governer Tamilisai Soundararajan
Telangana ఢిల్లీ కన్నా రాజ్ భవన్ చాలా దగ్గర: గవర్నర్ సంచలన ట్వీట్
నివురుగప్పిన నిప్పులా ఉన్న గవర్నర్ (Governor) వ్యవహారం మళ్లీ తెలంగాణ (Telangana)లో అగ్నిపర్వతంలా పేలింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తున్నారని..
నివురుగప్పిన నిప్పులా ఉన్న గవర్నర్ (Governor) వ్యవహారం మళ్లీ తెలంగాణ (Telangana)లో అగ్నిపర్వతంలా పేలింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తున్నారని.. వాటి ఆమోదానికి ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary of Telangana) సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్ వేదికగా స్పందించారు. ‘ఢిల్లీ కన్నా రాజ్ భవన్ చాలా దగ్గరగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. అంటే ఢిల్లీ (Delhi)కి వెళ్లాల్సిన వారు రాజ్ భవన్ (Raj Bhavan)కు వచ్చి ఉంటే సరిపోయేది అనే అర్థంలో ఆమె ట్వీట్ ఉంది. గవర్నర్ ట్వీట్ తో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య మరింత వివాదం ముదిరింది.
తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Tamilisai Soundararajan) మధ్య వివాదం (Clashes) సద్దుమణగడం లేదు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడంతో ఈ వివాదం సద్దుమణిగింది అని అందరూ భావించారు. కానీ ఆమె బిల్లులు ఆమోదం తెలపకుండా తన వద్దే పెండింగ్ లో ఉంచారు. నెలలు గడుస్తున్నా వాటి అంశంపై రాజ్ భవన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తలుపు తట్టింది. పెండింగ్ బిల్లుల గురించి ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Santhi Kumari) రిట్ పిటిషన్ (Writ petition) వేశారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో గవర్నర్ శుక్రవారం ట్విటర్ (Twitter) వేదికగా స్పందించారు.
‘ప్రియమైన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ కన్నా రాజ్ భవన్ చాలా దగ్గర ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాక కనీసం మర్యాదపూర్వకంగానే రాజ్ భవన్ కు వచ్చేందుకు సమయం చిక్కలేదా? ప్రొటోకాల్ లేదు. కర్టెసీ లేదు. స్నేహాపూర్వకంగా అధికారిక సంప్రదింపులతో పరస్పరం సహకరించుకుంటే సమస్యలకు పరిష్కారం లభించలేవా? ఢిల్లీ కన్నా రాజ్ భవన్ చాలా దగ్గర అని మరొకసారి గుర్తు చేస్తున్నా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
కాగా గవర్నర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 10 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, అటవీ వర్సిటీ అప్ గ్రేడ్ బిల్లు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయి మెంట్ చట్ట సవరణ బిల్లు, మోటార్ వెహికిల్ టాక్సేషన్ సవరణ బిల్లు, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, అగ్రికల్చరల్ యూనివర్సిటీ సవరణ బిల్లు పెండింగ్లో ఉన్నాయి. కాగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Dear @TelanganaCS Rajbhavan is nearer than Delhi. Assuming office as CS you didn't find time to visit Rahbhavan officially. No protocol!No courtesy even for courtesy call. Friendly official visits & interactions would have been more helpfull which you Don't even intend.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisai4BJP) March 3, 2023