Governer: తెలంగాణ గవర్నర్ (Governer) తమిళి సై సౌందరరాజన్ హాట్ కామెంట్స్ చేశారు. శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తనపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. అదే దాడి చేస్తే రక్తాన్ని సిరగా చేసుకుని చరిత్ర రాసుకుంటా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాను అడుగుపెట్టే సమయానికి మహిళా మంత్రులు లేరని గుర్తుచేశారు. తాను వచ్చిన తర్వాత ఇద్దరికీ పదవులు లభించాయని.. వారితో ప్రమాణం చేయించడం సంతోషంగా ఉందన్నారు. గవర్నర్గా ప్రోటోకాల్ గౌరవం ఇచ్చినా, ఇవ్వకపోయినా పనిచేసుకుంటూ ముందుకెళతా అని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో గవర్నర్తో సీఎం కేసీఆర్కు పొసగడం లేదు. పలు అంశాలపై విభేదాలు వస్తున్నాయి. ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కోసం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించి పంపితే.. వారు సేవా కార్యక్రమాలు చేపట్టలేదని తిరస్కరించారు. అంతకుముందు పాడి కౌశిక్ రెడ్డికి కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. దాంతో గవర్నర్ లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు విమర్శల దాడి చేస్తున్నారు. గవర్నర్ భద్రాచలం, ఇతర చోట్లకు వెళ్లిన సమయంలో ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు. అదే విషయాన్ని ఈ రోజు తమిళి సై సౌందర రాజన్ ప్రస్తావించారు.
ఇటీవల సచివాలయ ప్రారంభోత్సవ సమయంలో గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ కలిసి ఉన్నట్టు అనిపించింది. ఆ వెంటనే మళ్లీ సేమ్ సిచుయేషన్ నెలకొంది. గవర్నర్.. రాజ్యాంగబద్దమైన పదవీలో ఉంటూ.. బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. దానికి బీజేపీ నుంచి అదే రేంజ్లో కౌంటర్ వస్తోంది.