»Telangana Govt New Programme Wii Be Launch For Womens On International Womens Day
Women’s Day మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో కానుక.. ఏమిటంటే?
తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) మహిళలకు పెద్ద పీట వేస్తోంది. స్వరాష్ట్రంగా ఏర్పడిన తొలినాళ్లల్లోనే మహిళల రక్షణకు షీ టీమ్స్ (She Teams) తీసుకొచ్చింది. మహిళల రక్షణగా ఆ కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు అందిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) మహిళలకు పెద్ద పీట వేస్తోంది. స్వరాష్ట్రంగా ఏర్పడిన తొలినాళ్లల్లోనే మహిళల రక్షణకు షీ టీమ్స్ (She Teams) తీసుకొచ్చింది. మహిళల రక్షణగా ఆ కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు అందిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ (KCR Nutrition Kit) అంటూ గర్భిణీలకు ప్రత్యేకమైన కిట్ అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) సందర్భంగా మరో కానుకను మహిళలకు అందించనుంది. ఇకపై ప్రతివారం మహిళలకు వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని మహిళా దినోత్సవం రోజు మార్చి 8న ప్రారంభించనున్నారు.
‘ఆరోగ్య మహిళ’ (Arogya Mahila) పేరిట ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం (Tuesday) మహిళలకు ప్రత్యేకంగా వైద్యం అందిస్తారు. మొదటగా 24 జిల్లాల్లోని వంద ఆస్పత్రు (Hospitals)ల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. మహిళలు సాధారణంగా ఎదుర్కొనే 8 రుగ్మతలకు సంబంధించి స్క్రీనింగ్, వైద్య పరీక్షలు (Medical Tests), చికిత్సలు (Treatment) అందిస్తారు. వైద్య విద్య సంచాలకుల పరిధిలోని 14 ఆస్పత్రులు, వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని 19 ఆస్పత్రుల్లో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమంపై గురువారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (T Harish Rao), ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతా మహంతి, డైరెక్టర్లు శ్రీనివాస రావు, రమేశ్ రెడ్డి, కమిషనర్ అజయ్ కుమార్ తదితరులతో సమీక్ష చేశారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ సీ) (Primary Health Centre)లో మధుమేహం, రక్తపోటు, రక్తహీనత వంటి సాధారణ పరీక్షలతో పాటు వంద కేంద్రాల్లో 57 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు.
ఈ కార్యక్రమం కింద అందించే చికిత్సలు, పరీక్షలు
– మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు
– ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్, అవసరమైన వారికి వైద్యం. పరికరాలు, మహిళా రేడియోగ్రాఫర్లు, స్టాఫ్ నర్సులు, రేడియాలజిస్టులు సిద్ధంగా ఉండేలా చర్యలు
– థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాల గుర్తింపు. అయోడిన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపం, విటమిన్ బీ12, డీ పరీక్షలు చేసి చికిత్సతో పాటు మందులు అందిస్తారు.
– మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ ఫ్లమేటరి వ్యాధుల పరీక్షలు చేస్తారు.
– మోనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్ తో అవగాహన కల్పిస్తారు.
– నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్య అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి అవగాహన కల్పిస్తారు. అవసరమైన వారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.
– లైంగిక సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కల్పించడంతో పాటు వైద్యం అందిస్తారు.
– ప్రతి మంగళవారం ఏఆర్ టీ కేంద్రాలను మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయిస్తారు.
– బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటి వాటిపై మహిళలకు అవగాహన కల్పిస్తారు.