తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త. గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రకటన జారీ చేసింది. ఏకంగా 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు (Telangana Residential Educational Institutions Recruitment Board -TREIRB) నుంచి 9 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 2022 ఉగాదిని పురస్కరించుకుని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ ఉద్యోగాల ప్రకటన విడుదలైంది.
డిగ్రీ కళాశాలల్లో 868 అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ మేరకు కన్వీనర్ మల్లయ్య భట్టు ప్రకటన విడుదల చేశారు. పోస్టులు ఇలా ఉన్నాయి. జూనియర్ కళాశాలల్లో 2008 అధ్యాపకులు, పాఠశాలల్లో 1,276 పీజీటీ, 434 లైబ్రేరియన్, 275 ఫిజికల్ డైరెక్టర్, 134 ఆర్ట్స్, 92 క్రాప్ట్, 124 సంగీతం, 4020 టీజీటీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే దరఖాస్తుల తేదీని కూడా ప్రకటించారు. ఈనెల 12 నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. 17వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఫీజు, ఏయే ఖాళీల భర్తీ వంటి తదితర వివరాల కోసం www.treirb.telangana.gov.in.లో అభ్యర్థులు సందర్శించవచ్చు. కాగా వీటికి సంబంధించిన పరీక్షలు జూన్ తర్వాత నిర్వహించే అవకాశం ఉంది.
కాగా ఈ ఉద్యోగాల ప్రకటన విడుదల కావడంపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతూ ఓ ట్వీట్ చేశారు. ‘నాడు 123 ఉన్న రెసిడెన్షియల్ లు.. నేడు 1011 రెసిడెన్షియల్ ఏర్పాటు చేసి కేజీ నుండి పీజీ వరకు అన్ని స్థాయిల్లో అత్యున్నత ప్రమాణాలతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఒక వైపు మౌలిక సదుపాయాలు, మరో వైపు నాణ్యమైన బోధనతో ప్రభుత్వం విద్యాసంస్ధల్లో కార్పోరేట్ స్ధాయి విద్యను అందిస్తున్న సీఎం కేసీఆర్, తాజాగా గురుకుల విద్యాసంస్థల్లో భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించారు. 9,231 పోస్టుల భర్తీకి తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు నోటిఫికేషన్ విడుదల. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు’ అని పోస్టు చేశారు.
నాడు 123 ఉన్న రెసిడెన్షియల్ లు.. నేడు 1011 రెసిడెన్షియల్ ఏర్పాటు చేసి కేజీ నుండి పీజీ వరకు అన్ని స్థాయిల్లో అత్యున్నత ప్రమాణాలతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తూ.. ఒక వైపు మౌలిక సదుపాయాలు, మరో వైపు నాణ్యమైన బోధన తో ప్రభుత్వం విద్యాసంస్ధల్లో కార్పోరేట్… pic.twitter.com/j0K1WgwK7s
Calling all changemakers #TSWREIS and other TS Residential Educational Institutions Societies are looking for passionate individuals who are committed to change the world through quality education.Are you ready to join our team and impact the lives of underprivileged students? pic.twitter.com/8NAsJcbFKx