»Yadadri Sri Lakshmi Narasimha Swamy Devasthanam Jobs Notification Qualification And Other Details
Yadadri Temple Jobs గుడ్ న్యూస్: యాదాద్రి ఆలయంలో ఉద్యోగావకాశాలు.. త్వరపడండి
యాదాద్రి ఆలయంలో ఉద్యోగవకాశాల ప్రకటన విడుదలైంది. ఎంచక్కా ఆలయ పరిధిలో ఉద్యోగం చేసుకునే అవకాశం లభించింది. భగవంతుడి సన్నిధిలో ఉద్యోగం చేయడమంటే మాటలా? అతి కొద్దిమందికి మాత్రమే ఆ భాగ్యం దక్కుతుంది.
తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం.. హైదరాబాద్ (Hyderabad)కు చేరువగా ఉన్న యాదాద్రి ఆలయంలో (Yadadri) ఉద్యోగవకాశాల ప్రకటన విడుదలైంది. ఎంచక్కా ఆలయ పరిధిలో ఉద్యోగం చేసుకునే అవకాశం లభించింది. భగవంతుడి సన్నిధిలో ఉద్యోగం (Job) చేయడమంటే మాటలా? అతి కొద్దిమందికి మాత్రమే ఆ భాగ్యం దక్కుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అసలు ఉద్యోగం ఏమిటి? అర్హతలు (Qualifications) ఏమిటో తెలుసుకోండి.. దరఖాస్తు చేసుకోండి.
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో (Yadadri Sri Lakshmi Narasimha Swamy Devasthanam) సంస్కృత విద్యా పీఠం (Samskrit Vidya Peetham) కొనసాగుతున్నది. ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల (Teachers) ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. ఆంగ్లం, సంస్కృతం భాషోపధ్యాయుల కోసం ప్రకటన విడుదల చేశారు. అయితే ఆ పోస్టులు మూడంటే మూడే ఉన్నాయి.
సంస్కృత (Sanskrit) టీచర్లు 2 ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుకు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బీఈడీ విద్య కూడా చదివి ఉండాలి.
ఇక ఉన్న ఏకైక ఆంగ్ల (English) భాష ఉపాధ్యాయ పోస్టుకు కూడా పై అర్హతలే. ఆంగ్లం సబ్జెక్టు ఉండి 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి.
42 ఏళ్లలోపు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హులైన వారు ఆఫ్ లైన్ (Offline) విధానంలో తమ దరఖాస్తులు పంపించారు. దరఖాస్తుతో పాటు విద్యార్హత ధ్రువపత్రాలతో పోస్టులో పంపించాల్సి ఉంటుంది. జూన్ 15వ తేదీ సాయంత్రం 5.30లోపు దరఖాస్తు పంపించాలి. మరిన్ని వివరాలకు https://yadadritemple.telangana.gov.in/లో సంప్రదించవచ్చు.